![]() |
![]() |
బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో దివ్య, తనూజ అయితే ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళే అయిపోయాయి. ఇక హౌస్ లో ఏడో వారం నామినేషన్ లో ఎవరుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ప్రతివారంలా కాకుండా.. ఈవారం నామినేషన్స్ హక్కుని పోరాడి గెలవాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో మొదటగా ఇమ్మాన్యుయల్, అయేషాలు ఈ నామినేషన్స్ హక్కుని పొందడం కోసం పోటీపడ్డారు. ఇందులో అయేషాకి డైరెక్ట్ నామినేషన్ కార్డ్ లభించింది. దాంతో తగిన కారణం చెప్పి.. వాళ్ల మొహంపై నురుగను పూసి నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో తన పవర్‌ని ఉపయోగించి రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది అయేషా. తను నామినేషన్‌కి రీజన్ చెప్తుంటే.. ఒక్కనిమిషం అని చెప్పి తన మొహంపై ఉన్న నురుగను తుడుచుకుంటుంది రీతు. తనని ఒక్క నిమిషం అని చెప్పడంతో.. నీకోసం అందరు వెయిట్ చేయాలా అని అయేషా అంది. మొహంపై ఉన్న నురుగను తీస్తేనే కదా మాట్లాడేదంటూ రీతు యాటిట్యూడ్‌తోనే సమాధానం చెప్పింది. నువ్వు నీ ఓవరాక్షన్ నాకు ఈ ఇంట్లో అస్సలు నచ్చలేదు.. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసమని అయేషా అంది. నీకు చెప్పానా.. నేను లవ్ చేస్తున్నానని.. లవ్ చేస్తూ తిరుగుతున్నానని నీకు చెప్పానా అంటూ రీతు అంది.
నేను డైరెక్ట్‌గా రీతూని నామినేట్ చేస్తున్నానంటూ అయేషా అంది. ఈ నామినేషన్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని రీతూని బిగ్ బాస్ అడుగగా.. నాకు ఆ అమ్మాయి ఏం చెప్పినా వినాలని లేదని, నాకు అనిపించింది నేను చెప్తా.. నాకు అనిపించింది నేను అనేస్తానని అయేషా అంది. నీకు అనిపిస్తే అనేస్తావ్.. అన్నంతమాత్రానా అదే కరెక్ట్ కాదని రీతూ అంటుంది. ఏయ్ ఎందుకే నీకు అంత యాటిట్యూడ్ అని అయేషా ఫైర్ అయ్యింది. నీకు ఎంత యాటిట్యూడ్ ఉంటే.. నాకు అంతే ఉంటుందంటూ రీతు ఫైర్ అయింది. నువ్వు నాకు నచ్చలేదు.. నీ గేమ్ స్ట్రాటజీ నచ్చలేదంటూ అయేషా ఫుల్ ఫైర్ అయింది.
![]() |
![]() |